శుక్రవారం విడుదలైన ఎన్టీఆర్ మూవీ బాద్ షా మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బాద్‌షా సినిమా టికెట్ల క్యూలైన్‌లో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఎన్టీఆర్‌ అభిమాని మృతి చెందాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా డోన్‌ లోని శేషు థియేటర్‌ వద్ద జరిగింది. దాంతో అక్కడ విషాదం నెలకొంది. ఇటీవల బాద్ షా ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాదులో ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన రాజు అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తొక్కిసలాటలో మరణించడంతో చిత్రయూనిట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏర్పాట్లు సరిగా చేయకపోవడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని కుటుంబానికి ఎన్టీఆర్ తో పాటు నిర్మాత బండ్ల గణేష్ చెరో ఐదు లక్షలు అందించారు. తాజాగా బాద్ షా సినిమా మరో అభిమానిని బలి తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: