తెలుగులో ప్రస్తుతం ఉన్న దర్శకులలో కృష్ణవంశీది విభన్నమైన శైలీ అని చెప్పుకోవాలి. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ జులై 28, 1962లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. బీఎస్సీ వరకూ అక్కడే విద్యాభసం పూర్తి చేసుకున్నారు. తరువాత ఆగ్రా యూనీవర్శటీ నుంచి అగ్రీకల్చర్ ఎకనామిక్స్ లో ఎం.ఎ పూర్తి చేశారు. తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద సహయకుడుగా పనిచేశారు. గులాబీ చిత్రంతో దర్శకుడిగా మారారు. నిన్నే పెళ్లాడుతా, మురారీ, రాఖీ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆంద్రా టాకీస్ బ్యానర్ మీద సింధూరం సినిమాను తెరకెక్కించారు. ప్రసుత్తం నాని హీరోగా పైసా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కెరీర్ లో కృష్ణవంశీ ఎత్తుపల్లాలను ఎదుర్కోన్నా, తన ప్రతిభపై ఎప్పుడూ నమ్మకాన్ని పొగొట్టుకోలేదు. కృష్ణవంశీ నటి రమ్యకృష్ణను 2003లో వివాహం చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: