బృందావనం తరవాత ఎన్టీఆర్, సమంతల జోడీ మరోసారి కనువిందు చేయబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వీరిద్దరూ మరోసారి సిల్వర్ స్ర్కీన్ పంచుకోబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, సమంతలపై టీజింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
వీరిద్దరి కెమిస్ర్టీ కేక పుట్టిస్తోందని... మరోసారి ఈ కాంబినేషన్ హిట్ కావడం ఖాయమని హరీష్ శంకర్ ట్విట్ చేశాడు. ఇంతకీ ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. మాంఛి మాస్ టైటిల్ కోసం చిత్రబృందం తెగ కసరత్తు చేస్తోంది.
త్వరలోనే టైటిల్ ఏమిటనేది అధికారికంగా ప్రకటిస్తారు. ఇందులో శ్రుతిహాసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: