రవితేజతో నిప్పు సినిమాను నిర్మించి భారీగా నష్టపోయిన దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఇటీవల కాలం వరసగా పరాజయాలు చవిచూస్తున్న చౌదరి స్వీయదర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు ధర్మతేజతో ‘రేయ్’ సినిమాను ఎప్పుడో.. ప్రారంభించాడు. అయినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని, రద్దు అయిందని రక రకాల వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపించాయి. గుణశేఖర్ ‘నిప్పు’తో కొట్టిన దెబ్బకి చౌదరి ఈ ‘రేయ్’ ను అటక్కెంచాడని చాలా మంది భావించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. నూయార్క్ లో సాయి ధర్మతేజ, సయామీ ఖేర్, శ్రద్దాదాస్ తదితరులు మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి