సినీ తారలంటే సామాన్య జనానికి చాలా ఆసక్తి ఉంటుంది. వారి విషయాలు తెలుసుకోవాలని, ముఖ్యంగా వారిని దగ్గర నుంచి చూడాలని చాలా ఉత్సాహపడుతుంటారు. ఒకసారి అల్లు రామలింగయ్య రాజమండ్రి రైల్వే స్టేషన్ కు వచ్చారు. అల్లు దగ్గర నుంచి చూడటానికి జనం చుట్టూ చేరుతున్నారు. దీంతో అయన ఎదో వెతుకుతున్నట్లు నటించసాగారు. దీన్ని గమనించిన కొంత మంది అల్లు ను ఏమైందని అడిగారు. దానికి ఆయన ‘నా పర్స్ పడిపోయింది. వెతుక్కుంటున్నాను’ అని చెప్పారు. దీంతో అందరూ పర్స్ వెతికి పట్టుకుని రామలింగయ్యకు ఇవ్వాలని అతృత పడ్డారు. అందరూ పర్స్ వెతికే పనిలో పడ్డారు. అల్లు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: