అందాల రాక్షసి సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం చూసి దిల్ రాజు ఫిదా అయిపోయాడు. ఏపీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారానే చేస్తున్నాడు. రాజమౌళి అంతటి వాడు కూడా ఆ సినిమాకు నిర్మాతగా మారిపోయాడు. ఆ సినిమాలో నటించిన నటి లావణ్య. ఆమెది డెహ్రాడూన్. తెలుగులో తొలి సినిమా ఇదే. ఇందులో మిథున అనే పాత్రలో నటించింది. తను జీవితంలో ఎన్నెన్ని పాత్రలు చేసినా మిథున పాత్రను మర్చిపోలేనని అంటోంది. భవిష్యత్తులో తన పెర్ఫార్మెన్స్ కు తావుండే పాత్రల్లో నటిస్తానని అంటోంది. దిల్ రాజు తదుపరి చిత్రంలో కథానాయికగా ఎంపికైందని రహస్య సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: