ప్రభాస్ ఎక్కువ సమయం వెచ్చించి చేసిన సినిమా రెబెల్. ఈ సినిమా టీజర్ కార్యక్రమానికి హీరోయిన్లు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ప్రభాస్ మాత్రం రాలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉండటంతో రాలేకపోయారని నిర్మాతలు వివరణ ఇచ్చారు. ఎన్నో ఫంక్షన్లకు నటీనటులు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వస్తుంటారు. హీరో అంతటివాడు తన సినిమా టీజర్ జరుగుతుందని తెలుసుకున్నప్పుడు గంట ముందు రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఎందుకో ప్రభాస్ రాలేదు. లారెన్స్ మీద కోపంతో అని కొందరు, రెబెల్ ప్రమోషన్ లో పాల్గొనడం ఇష్టం లేదేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. నిజానిజాలు ప్రభాస్ కే తెలియాలి మరి. హారో ఊర్లోనే ఉండి ఫంక్షన్లకు రాకపోవడం దుష్పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: