సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాగ కథ... స్ర్కీన్ ప్లే... దర్శకత్వంలో యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడుగా సుప్రసిద్ధ నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపైన ఇంటిల్లపాది చూసి ఆనందించే కథతో ‘‘ఒక్కడినే’’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా ఒక్క పాటను గోవాలో చిత్రీకరణ గావించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తి అయింది. నిర్మాత సి.వి.రెడ్డి ఒక్కడినే సినిమా గురించి చెబుతూ ‘‘ మా చిత్రం కోసం షూటింగ్ చెయ్యాల్సివున్న డ్యూయెట్ సాంగ్ ని గోవాలోని సుందర ప్రదేశాలలో ఆగస్టు 17 నుంచి 20 వరకూ నారా రోహిత్- నిత్యమీనన్ల పైన చిత్రీకరించడం జరిగింది ‘‘ఓలలాలా.. గుండెలోనే వూలలాలా ... ఆపలేని తొలి ప్రేమలో తొలకరి సంగీతం’’ అంటూ భాస్కర బట్ల వ్రాసిన డ్యూయెట్ సాంగ్ ని బాను మాస్టారు గోవాలోని సుందరమైన ప్రదేశాలలో నారా రోహిత్- నిత్యమీనన్ ల పై చిత్రీకరించాం, ఇందులో 10 మంది డాన్సర్స్ కూడా పాల్గొన్నారు. ఈ పాటలు చిత్రీకరించడంలో నిర్మాణ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి.’’ అని తెలిపారు. సినిమా ఆడియోను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసి, అదేనెలలో సినిమాను కూడా విడుదల చేస్తామని తెలిపారు.  ఫ్యామిలీ అనుబంధాల తీవ్రతను కొత్త కోణంలో మా దర్శకుడు శ్రీనివాస్ రాగ ఓకొత్త కోణంలో అద్భుతమైన రీతిలో చిత్రీకరణ గావించారు. ప్రతి ఇంట్లోనూ మనవాళ్లముందు కన్పించే సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయిని చెప్పారు. ఈ సినిమా రోహిత్ కు హీరోగా  చాలా మంచి పేరుని  తెచ్చిపెడ్తుంది’’ అని అన్నారు. నారా రోహిత్ సరసన నిత్యమీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోటశ్రీనివాస్రావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాస్ రెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి మొదలగువారు ఇతర పాత్రల్ని పోషింస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : చింతపల్లి రమణ, సంగీతం : కార్తీక్, కెమెరామెన్ : ఆండ్రుబాబు, కళ : నాగేంద్ర. ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్ : గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: