హస్యనటులు హీరోలుగా మారటం సినిమా పరిశ్రమలో ఇవాళ కొత్త కాదు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హస్యనటుడు చేరాడు. ప్రముఖ హస్యనటుడు శ్రీనివాసరెడ్డి టీవీ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి గుర్తింపు పొందాడు. కాగా, త్వరలో శ్రీనివాసరెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తమిళ సినిమా ఆధారంగా రూపొందించే చిత్రంలో శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్నాడు. హీరోలుగా మారుతున్న హస్యనటులకు మంచి గుర్తింపు వస్తున్న ప్రస్తుత సమయంలో శ్రీనివాసరెడ్డి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని సినీ రంగంలో వారు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: