ఆల్ ఇండియాను తన అందంతో ఆకట్టుకున్న శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీదేవి కంటే ముందుగా మోనా కపూర్ ను బోనీకపూర్ వివాహం చేసుకునున్న విషయం తెలిసిందే. కాగా, బోనీ,మోనా కపూర్ ల కుమారుడు అర్జున్ కపూర్ ఇప్పుడు హీరోగా హల్ చల్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అర్జున్ కపూర్ ఇప్పటికే ఇష్క్ జాదే అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశాడు. ఇప్పుడు అర్జున్ కపూర్ హీరోగా నాలుగు సినిమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో మిస్టర్ ఇండియా-2 సినిమా కూడా ఉంది. అనిల్ కపూర్ హీరోగా 1987 సంవత్సరంలో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పడు మిస్టర్ ఇండియా సీక్వెల్ లో అనిల్ కపూర్ అన్న కొడుకు అర్జున్ కపూర్ హీరోగా నటించనున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: