‘మంచి ఉద్యోగాల కోసమో, మెరుగయిన జీవన ప్రమాణాల కోసమో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పడు మన దేశంలో చక్కని ఉద్యోగావకాశాలున్నాయి. వాటిని వినియోగించుకుంటే చాలు’’ అనే చిన్న సందేశానికి చక్కని వినోధాన్ని జోడించి రూపొందుతున్న చిత్రం ‘ ఎన్నారై’. ‘‘నౌ రిటర్న్ టు ఇండియా’’ అనేది ట్యాగ్ లైన్. రోహిత్- శ్రావ్యారెడ్డి జంటగా ఏరీస్ ప్రొడక్షన్ పతాకంపై రఘనందన్ గూడూర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలు సెప్టెంబర్ 1న ‘‘ మధుర ఆడియో’’ ద్వారా విడుదల కానున్నాయి. ఈ సినిమాతో అనీష్ రాజ్ దేశ్ ముఖ్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ‘‘ ఎన్నారై’’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతోపాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీష్ రావు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రఘనందన్ గూడూర్ మాట్లాడుతూ ‘‘ విదేశాల్లో పలు సంవత్సారలు ఉద్యోగాలు చేసిన వ్యక్తిగా.. విదేశీ నివాసంలో ఉండే కష్టాలు, నష్టాలు, భావోద్వేగపరమైన సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకే నేను దర్శకుడిగా మారుతూ.. నేనే నిర్మిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి అదే ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకున్నాను. అలా అని ఇందులో సందేశాలమేమి ఉండవు. వినోదానికి పెద్ద పీఠ వేస్తూ రూపొందిన చిత్రమిది. ’ అని తెలిపారు. ఆస్ట్రేలియాలో కొంత భాగం, హైదరాబాద్ లో ఎక్కువ శాతం షూటింగ్ చేసాం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. సెప్టెంబర్ 1న ఆడియో విడుదల చేసి, అదే నెల చివరికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆహుతి ప్రసాద్, హేమ, శివారెడ్డి, గుండుహనుమంతరావు, ఫిష్ వెంకట్ ముఖ్య తారాగాణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం : అనీష్ రాజ్దేశ్ ముఖ్, సాహిత్యం : శ్రీమతి పద్మశ్రీ శ్రీనివాస్, రచన – చిత్రానువాదం- నిర్మాత- దర్శకత్వం : రఘునందన్ గూడూర్!  

మరింత సమాచారం తెలుసుకోండి: