అల్లరి నరేష్ తాజా సినిమా సుడిగాడు విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. హీరో అల్లరి నరేష్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సుడిగాడు సినిమా విజయంతో అల్లరి నరేష్ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం. ఇప్పటి వరకూ కోటి రూపాయల వరకూ పారితోషకం తీసుకుంటున్న అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: