రిలయన్స్-లైన్స్ గేట్ సంస్థలు సంయుక్తంగా హాలీవుడ్ లో భారీ వ్యయంతో రూపొందించిన చిత్రం డ్రెడ్. ఈ సినిమాను సినీ స్టార్ సంస్థ సమర్పణలో సెన్సేషనల్ మూవీస్ బేనర్ పై గోగినేని బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ డ్రెడ్ సినిమా 2డి, 3డి వెర్షన్స్ లలో ప్రపంచ వ్యాప్తంగా 21న విడుదల చేస్తున్నారు. కరుడు కట్టిన నేరస్థుల నిలయంగా మారిన ఓ మెగా సిటిలో శాంతి భద్రతల కోసం నేరస్థులను శిక్షించే ప్రత్యేక బృందాన్ని డ్రెడ్ గా వ్యవహరిస్తారు. ఎలాంటి మగవారినైనా తన అంద చందాలతో తన వంశం చేసుకునే ఓ మాయాలేడీ ఈ నేరస్థుల సామ్రాజ్యానికి నాయకురాలు. ఈ దుండగురాలిని విచ్చల విడి కార్యకలాపాలు అరికట్టడానికి ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్ హీరో. ఈ హీరోని సైతం తన వశం చేసుకోవాలనుకున్న ఈ దుండుగురాలి నుంచి హీరో ఎలా తప్పించుకుని ఆ దుండుగురాలిని ఎలా శిక్షించాడు అన్నదే చిత్ర కథ. ఈ సినిమా తప్పకుండా యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: