అవిభక్త కవలలుగా హీరో సూర్య నటిస్తున్న బ్రదర్స్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ‘వెట్టయ్’ పేరుతో నిర్మించిన ఈ సినిమాను ‘బ్రదర్స్’ పేరుతో తెలుగులోకి బెల్లంకొండ సురేష్ అనువదిస్తున్నారు.
కాగా, సూర్య డబుల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రకు హీరో సూర్య డబ్బింగ్ చెబుతుంటే, మరో పాత్రకు సూర్య తమ్ముడు, హీరో కార్తీ డబ్బింగ్ చెబుతుండటం విశేషం. హీరోగా బిజీగా ఉన్నా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి తన తమ్ముడు ముందుకు రావడం సంతోషంగా ఉందని సూర్య అంటున్నాడు.
కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: