ఈ రోజుల్లో చిత్రంతో యువ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా బస్ స్టాఫ్. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో విడుదల వేడుక కార్యక్రమం శనివారం నాటి రాత్రి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరిగింది. ప్రముఖ కథానాయిక సమంత ఆడియోను విడుదల చేయగా, తొలి సీడీని సునీల్ స్వీకరించాడు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ఇటీవల రిలీజ్ అయిన మా చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆడియో, తరువాత సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకు వుందని’ తెలిపాడు. జె.బి అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమని చెప్పాడు. ఈ బస్ స్టాఫ్ సినిమాలో ప్రిన్స్, శ్రీ దివ్య, సాయికుమార్ పంపన, ఖన్నా, హాసిక తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: