హీరోయిన్ గా దశాబ్దకాలం పూర్తి చేసుకున్న చెన్నై బ్యూటీ త్రిష ఇక మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టబోతోందా? చెన్నై వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రిష వచ్చే ఏడాది పెళ్లి పీటలపై కూర్చోబోతోంది. మరి వరుడు ఎవరనేది త్రిష చెప్పలేకపోతోంది. నటిగా దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్నా… తరగని అందాలతో హీరోయిన్గా సౌత్ భాష ప్రేక్షకులను మెప్పిస్తూనే వుంది.
తండ్రి ఆకస్మిక మృతితో శోకసముద్రంలో మునిగిన త్రిష ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. ప్రస్తుతం విశాల్ సరసన నటిస్తున్న సమర్ చిత్రం తుది దశకు చేరుకుంది. ఇటీవలే కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం త్రిష మలేషియా వెళ్లింది. ప్రస్తుతం త్రిష. జీవా జంటగా నటిస్తున్న ఎండ్రెండ్రుమ్ పున్నగై చిత్రం మాత్రమే ఉంది.
ఇక సినిమాలను అంగీకరించడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. తండ్రి మరణం చాలా బాధించిందంటున్న త్రిష ఈ బాధ నుంచి కోలుకోవడం అంత సులభం కాదంటోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి