ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యా చేస్తున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. నిన్నటి వరకు కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేసిన రష్యా ఇక ఇప్పుడు జనావాసాల్లోకి కూడా దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ క్షణంలో  ప్రాణాలు పోతాయో అని అందరూ బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యుద్ధ విమానాలు క్షిపణుల ఫైటర్ జట్లతో ప్రస్తుతం ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది రష్యా. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక అక్కడ చిక్కుకున్న భారతీయులందరిని తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ మొదలైంది అన్నది తెలుస్తుంది.

 ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నుంచి రోమేనియా చేరుకున్నారు విద్యార్థులు. ఈ క్రమంలోనే భారత్ చేరుకో బోతున్నారు. రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలలో దాదాపు నాలుగు వందల డెబ్భై మంది విద్యార్థులు స్వదేశానికి రాబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే రోమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయ్. ఇక ఉదయం పదిన్నర గంటలకు ఒక విమానం ముంబై చేరుకోగా ఇక మరో విమానం మధ్యాహ్నం ముంబైకి చేరుకోబోతోంది అన్నది తెలుస్తుంది. అయితే  ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు అందరు కూడా రొమేనియా హంగేరి ప్రాంతాలకు తరలించారు అధికారులు.


 ఇక ప్రస్తుతం ఇక  భారతీయులందరూ రోమేనియా చేరుకున్న తర్వాత ఏరియా విమానాలను అక్కడికి పంపించి ఇక భారత్కు తరలింపు ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ తరలింపు ప్రక్రియకు ఖర్చు మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలుస్తోంది. ఇలా ఉక్రెయిన్ నుంచి భారత్కు వస్తున్న వారిలో 22 మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీకి చెందిన వారు 13 మంది.ముంబయికి చెందిన వారు 9 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు సాయంత్రం వరకు ఢిల్లీ ముంబై కి విమానాలు రానున్నాయని..  అందరూ విద్యార్థులు కూడా ఎంతో క్షేమంగా స్వదేశంలో రాబోతున్నారూ అని తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: