ఏలియన్స్ గురించిన చర్చ ఎప్పుడు జరిగినా అది ఎంతో ఆసక్తి కరంగానే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏలియన్స్ ఎలా ఉంటాయి అన్నది కేవలం సినిమాల్లో మాత్రమే చూశాము. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ ఉన్నాయని ఇక అప్పుడప్పుడు స్పేస్ షిప్ లో భూమి మీదికి వచ్చి పోతూ ఉంటాయి అని ఇక ఏలియన్ కి అద్వితీయమైన పవర్స్ ఉంటాయని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. నిజంగా ఏలియన్స్ అనగానే ప్రతి ఒక్కరి ఆలోచనలో అలాంటి రూపం అలాంటి పవర్స్ వస్తూ ఉంటాయ్.


 మరి నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా అంటే మాత్రం అటు శాస్త్రవేత్తలు సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఈనాటికీ. ఇక ఇటీవల కాలంలో ఏలియన్స్ కి సంబంధించిన వార్తలు అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఏలియన్స్ భూమి మీదికి రాబోతున్నాయని ఇక మానవులను వినాశనం చేయబోతున్నాయని కొన్ని కొన్ని సార్లు వార్తలు కూడా అందర్నీ భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నాయా లేవా అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఇటీవలే అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటిలిజెంట్ సంస్థ ఒక కీలక విషయాన్ని వెల్లడించింది.


 ఏకంగా ఐదు సందర్భాల్లో ఏలియన్స్ మానవులతో శృంగారం జరిపిన ఘటనలు నమోదయ్యాయి అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.  ఇక ఇలా ఏలియన్స్ మానవులతో శృంగారం జరిగిన ఘటనలో ఒక మహిళ గర్భం దాల్చిందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఏలియన్స్ ప్రయాణించే యు.ఎఫ్.ఒ లను చూసిన వారిలో జుట్టు రాలడం తలనొప్పి పీడ కలలు రావడం లాంటి సమస్యలు వేధిస్తుంటాయి అన్న విషయాన్ని కూడా గుర్తించినట్టు అమెరికాకు చెందిన డిఫెన్స్ ఇంటిలిజెంట్ శాస్త్రవేత్తలు చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: