ఇటీవలే చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. చైనా ఇష్టర్న్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం ఒక్కసారిగా కుప్ప కూలి పోయింది. సాంకేతిక లోపం కారణం గానే ఈ ప్రమాదం జరిగింది అని అందరు అనుకున్నారు. 133 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం ఒక్క సారిగా కొండ ప్రాంతాల్లో కూలి పోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


 పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన నేపథ్యంలో అటు సహాయక చర్యలు పెట్టడానికి ఎంత కష్ట పడ్డారూ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం కేవలం సాంకేతిక సమస్య కారణం గా నే జరిగిందని అందరూ భావించారు. అయితే ఇక ఈ ఘటన పై అక్కడి ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. ఇక ఈ విచారణలో భాగం గా షాకింగ్ విషయాలు వెలుగు లోకి వచ్చాయి అని తెలుస్తోంది. ఇటీవలే మార్చిలో చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన వార్త ప్రచురించడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. బోయింగ్ 737- 800 విమానం ప్రమాదవశాత్తు కూలి పోలేదు అంటూ ప్రచురించింది.


 కాక్పిట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు కావాలని విమానాన్ని కూల్చివేశారు అంటూ పేర్కొంది. ఇక విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్ లో కూడా ఇదే వెల్లడైంది అంటూ తెలిపింది. దీంతో ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. గ్వంజావ్ కు  వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందులో ఉన్న 132 మంది ప్రయాణికులు చివరికి ప్రాణాలు వదిలారు. అయితే ఇక ఇటీవలే వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన వార్త నేపథ్యంలో సరికొత్త అనుమానాలు కూడా తెర మీదికి వస్తున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: