ప్రేమ గుడ్డిది.. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ఇక ప్రేమ పుట్టడానికి ఆస్తి అంతస్తులు అవసరం లేదు.. రెండు మనసుల మధ్య ఏ క్షణంలోనైనా ప్రేమ పుట్టవచ్చు. ఇలా పుట్టిన ప్రేమ ఏకంగా జీవితానికి సరిపోయే విధంగా మధురానుభూతులను పంచుతూ ఉంటుంది. ఇక ప్రేమలో మునిగితే ఈ లోకాన్నే మరిచిపోయేలా చేస్తూ ఉంటుంది. ప్రేమలో పడ్డవారు ఎక్కువగా ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. అయితే ఇక ఇలా లవ్ లో ఉన్న వారు చెబుతున్న మాటలు మాత్రం సింగిల్స్ కి కాస్త చిరాకు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఇప్పటివరకు ఎంతోమంది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని నిరూపించి.. తమ కంటే పెద్దవారిని పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి క్రీడాకారులు వరకు ఇప్పటివరకు ఎంతోమంది ఇలా తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకొని ఎంతమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇలా తమకంటే రెండు మూడేళ్లు మహా అయితే ఒక 10 ఏళ్లు పెద్ద వారిని పెళ్లి చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ మాత్రం 28 ఏళ్ల యువకుడు 83 ఏళ్ల బామ్మను ప్రేమించాడు. అంతటితో ఆగకుండా వివాహం కూడా చేసుకున్నాడు. ప్రేమ గుడ్డిది అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు.


 ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. పోలాండ్ కు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలికి పాకిస్తాన్ కు చెందిన 28 ఏళ్ల హఫీజ్ నాదీమ్ అనే యువకుడికి ఫేస్బుక్ వేదికగా పరిచయం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక 83 ఏళ్ల వయసులో ఆ బామ్మ ఎంతో రిస్కు చేసింది.. ప్రియుడుతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుని భావించి పోలాండ్ నుంచి పాకిస్తాన్ కు వచ్చేసింది. చివరికి పెద్దలను ఒప్పించి ఇక ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ప్రస్తుతం సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: