బయటకి వెళితే చాలు తీవ్రమైన ఎండలు, తాపం, వేడి . మాటి మాటికీ దాహం తో గొంతు ఎండిపోవడం.. ఇలాంటి పరిస్థితి రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక చమటల సంగతి అయితే చెప్పక్కర్లేదు కూడా. అయితే రాబోయే రోజుల్లో భూమి ఎక్కే వేడి దెబ్బకి ఇప్పుడు ఉన్న రికార్డు ఉష్ణోగ్రత లు ఏవీ కనపడవట . అంతకంతకూ వేడి పెరుగుతూ ప్రతీ సంవత్సరం వేడి శాతం పెరుగుతూ బయటకి కూడా రాలేని పరిస్థితి ఉద్భవిస్తుంది అంటున్నారు.

 

ప్రస్తుతం ఉన్న గ్రీన్ హౌస్ వాయువులు గాలిలో చేరడం , పర్యావరణం లో వస్తున్న అత్యంత విపరీతమైన మార్పులు సంభవించడం లాంటివి ఆగకుండా జరుగుతూ ఉంటే యాభై ఏళ్ళలో అతి దారుణమైన ఎండలు రాబోతున్నాయి అని వాతావరణ పరిశోధనా కేంద్రం చెబుతోంది. అమెరికా లో ఉన్న ఈ కేంద్రం చేస్తున్న హెచ్చరికలు బట్టీ చూస్తే 2061 - 2080 ల మధ్య కాలం లో అంటార్కిటికా ప్రాంతాన్ని పక్కన పెట్టేస్తే మిగితా ప్రపంచం అంతా నిప్పుల కొలిమిగా మారుతుంది అంటున్నారు. ఈ ప్రపంచానికి ఈ వేడిమి అతిపెద్ద సవాలు గా మారుతుంది అంటున్నారు.

 

 అవి అతి దారుణమైన ఆరోగ్య సమస్యలు పెంచుతాయి , పంటలు నష్టపోయి ఆహారానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. తీవ్రమైన దుర్భిక్షాలు ఏర్పడతాయి. ఎండలు పెరిగీ పెరిగీ ఎండ చావులు అధికం అవుతాయి అని ఈ వాతావరణ కేంద్రం చెబుతోంది. వాతావరణం లో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి అది మనుషుల ప్రాణాలనీ ఊపిరి తీసుకున్న తరవాత కూడా చనిపోయే వ్యాధులనీ అందిస్తుంది అనీ అంటున్నారు. మరొక పక్క హిమాలయాలు భూకంపానికి సిద్దంగా ఉన్నాయి అనీ నేపాల్ లో గత సంవత్సరం వచ్చినదానికంటే అతిపెద్ద భూకంపం హిమాలయాలలో రాబోటింది అంటున్నారు వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: