ఈ మద్య సినిమా హీరోయిన్ల కన్నా మోడలింగ్ చేసే వారే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. ఇక మోడలింగ్ వ్యవస్థ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినవారే ఎక్కువ. బాలీవుడ్ లో ఎక్కవ మంది హీరోయిన్లు ఇలా వచ్చిన వారే. అయితే బ్రిటీష్ మోడల్ ని కొంత మంది దుండగులు కిడ్నాప్ చేసి సెక్స్ బానిసగా అమ్మాయాలని ప్రయత్నించారు..కానీ అదృష్టం కొద్ది ఆమె బయట పడింది. వివరాల్లోకి వెళితే..ఇంగ్లండ్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న హెర్బా (30 ).. ఇటలీ లోని మిలాన్‌లో ఫొటోషూట్‌ పేరుతో అయిలింగ్‌కు వలవేశాడు.
 డార్క్‌ వెబ్‌ సైట్‌ కోసం బేరసారాలు..:
ఫేక్ ఫోటోషూట్‌తో బ్రిటీష్ మోడల్ అయిలింగ్‌కు వలవేశాడు. అదంతా ఫేక్ అని తెలియని అయిలింగ్ అతని ట్రాప్‌లో చిక్కుకుపోయింది.  ఫోటోషూట్ కోసం అయిలింగ్ ఇటలీలోని మిలాన్ లో హెర్బా చెప్పిన చోటుకు వెళ్లింది.  అక్కడికి వెళ్లిన తర్వాత అసలు సంగతి తెలిసింది..తాను దారుణంగా మోసపోయానని. అక్కడకు కొంత మంది దుండగులు వచ్చి కాళ్లు, చేతులు కట్టిపడేసి ఆమెనో సూట్ కేసులో కుక్కేశారు.
ఇటలీలో కిడ్రాప్..:
ఆ తర్వాత ఇంటర్నెట్‌లో ఒక డార్క్‌ వెబ్‌ సైట్‌లో అయిలింగ్‌ను సెక్స్‌ బానిసగా అమ్మేయడానికి కిడ్నాపర్లు బేరసారాలు సాగించినట్టుగా అయిలింగ్ పోలీసులకు వెల్లడించారు.  ఇందుకోసం మూడు లక్షల డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.కిడ్నాప్ తర్వాత తననో సూట్ కేసులో కట్టిపడేశారని, కారు డిక్కీలో పడేసి టురిన్ శివార్లలో ఉన్న ఒక ఫామ్‌హౌజ్‌కు తరలించారని అయిలింగ్ చెప్పారు. అక్కడే తనను కుర్చికి కట్టిపడేశారు..చాలా మంది రావడం..పోవడం జరిగిందని అయిలింగ్ ఆరోపణలో వ్యక్తం చేసింది.  
Related image
 కొన్ని రోజుల వరకు అదే కుర్చీలో గడిపానని ఆమె వెల్లడించారు. అయితే తాను రెండు సంవత్సరాల బాబుకి తల్లిని కావడంతో దుండగులు ఆమెను గతేడాది జులైలో మిలాన్‌లోని బ్రిటిష్‌ కాన్సులేట్‌ వద్ద వదిలేసి పారిపోయారు. అయిలింగ్ ఫిర్యాదు తో ర్బాను అరెస్ట్ చేసిన ఇటలీ పోలీసులు అతని నుంచి ఈ వివరాలన్ని రాబట్టారు. దీంతో అశ్లీల సైట్ల కోసం అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది.

Image result for british model ailing


మరింత సమాచారం తెలుసుకోండి: