దిశ నిందితులని షాద్ నగర్ కోర్టు పర్మిషన్ తో డిసెంబర్ 4న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 2 రోజుల పాటు విచారించారు. అయితే ఆ రెండు రోజులలో దోషులు ఎవరి కంట పడలేదు. పోలీసులు... వారిని ఏం చేశారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. నివేదికల ప్రకారం.. ఆ రెండు రోజులు కస్టడీలో ఉన్న నిందితులను... గతంలో ఇతర నేరాలేమైనా చేసారా అని విచారించారంట.

 

నిజానికి... నిందితులు దిశ పై అఘాయిత్యం చేసేటప్పుడు పక్క ప్లాన్ ప్రకారం చేసారు. టైర్ పంక్చర్ చేయడం, దిశ దృష్టిని మరల్చడం, కిడ్నాప్ చేయడం, ఆపై రేప్, సజీవ దహనం చేసారు. ఇవన్నీ పరిశీలిస్తే... కరుడుగట్టిన నేరస్తులు మాత్రమే ఇంత ప్రణాళిక కరంగా చేస్తారని తెలుస్తుంది. ఎంత క్రిమినల్ మైండ్ లేకపోతే మాత్రం కొంచెం కూడా భయం, జాలి లేకుండా అంత ఘోరం చేస్తారని పోలీసులు అభిప్రాయపడట్లు సమాచారం. ఇకపోతే... మొదటిసారి నేరం చేసిన వారైతే... ఇంతకు తెగిస్తారా? అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. 

 

వీరు చేసిన నేరం వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంది. గతంలోనూ వారు ఖచ్చితంగా నేరం చేసారని పోలీసులు అనుమానపడడంలో అర్ధం ఉంది. ఇప్పటికే... బాహ్య వలయ రహదారి చుట్టూ ఉన్న నిర్మానుష్య ప్రాంతాలలో... అనుమానాస్పద స్థితిలో దహనమైన 3 మహిళ శవాలు పోలీసులకు దొరికాయి. ఈ మృతుల వెనుక వీరి హస్తం ఉంటుందనే అనుమానం రేకెత్తుతుంది. నిజానికి... ఆ 3 మహిళ కేసులు ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలాయి. దీంతో... ఆ కేసుల్లో వీరు ఇన్వాల్వ్ అయ్యిఉంటారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా... 5 గంటల పాటు దిశ మృతదేహంతో ఏం చేసారు, 30 కిలోమీటర్ల దూరంలోని చటాన్‌పల్లికి ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్నలను పోలీసులు అడిగారని సమాచారం. కాగా, విచారణ మొత్తం చాలా గోప్యంగా పోలీసులు ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: