విపరీతమైన చలికాలంలో కూడా ఇంతగా ప్రజలకు వొంట్లో వణుకు పుట్టలేదు.. వర్ష కాలం కూడా వరదలు పొంగిన ప్రజలు భయపడలేదు.. కాని సీజన్ అనేది లేకుండా చిరుతలా పరిగెత్తుతున్న కరోనాను చూస్తుంటే మాత్రం ప్రతి వారి గుండెలు గుడిలో గంటల్లా మోగుతూనే ఉన్నాయట.. ఇప్పటివరకు వచ్చిన వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాలు కూడా కరోనా అంటే బిక్కచచ్చిపోతున్నాయట.. ఇక అన్నిదేశాలను పలకరిస్తు వస్తున్న కరోనా ఒకే ఒక్క దేశాన్ని మాత్రం మరచిపోయినట్టుగా ఉందంటున్నారు.. ఇకపోతే ఒకప్పుడు ప్రాణాంతకంగా మారిన వ్యాధి ఎబోలా.. దీనిపేరు తలచుకోగానే అందరికి గుర్తుకు వచ్చేది కాంగో. 1953 వ సంవత్సరంలో మొదలైన ఈ ఎబోలా కాంగోలో విపరీతంగా వ్యాపించింది.

 

 

ఒక కాంగో మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశాల్లో సైతం ఈ వైరస్ విలయతాండవం సృష్టించింది.  అయితే, ఎబోలా వైరస్ ఇప్పుడు అక్కడ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో మరో దరిద్రం కరోనా రూపంలో దాపురించిందట.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతున్నది. ఆఫ్రికా దేశంలో మొదట నైజీరియాలో మాత్రమే ఈ వైరస్ ఉండగా, వెంటనే ఆ దేశం ట్రావెలింగ్ పై నిషేధం విధించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.  క్రమంగా ఈ వైరస్ ఆఫ్రికా ఖండంలోని మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపించింది. కానీ ఒక్క అంటార్కిటికా ఖండం తప్పించి మిగతా ఆరు ఖండాల్లో ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుందట..

 

 

ఇలా ప్రతి దేశంలో ఒకటి లేదా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్దితిలో అలమటిస్తున్నారట.. ఇకపోతే ఇదివరకు వచ్చిన వైరస్‌లకంటే ఈ కరోనా భిన్నంగా ఉండటంతో పాటుగా బలంగా కూడా ఉండటంతో దీనిని తక్కువగా అంచనా వేయకుండా, అన్ని దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.. ఇందులో భాగంగా కొంత కాలం వరకు స్వచ్చందంగా సెలపులు పాటిస్తున్నాయి.. ఇక అప్పటికైనా ఈ వైరస్ ప్రభావం తగ్గితే సరి.. లేకుంటే పరిస్దితులు మాత్రం అల్లోకల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: