నాలుగేళ్ల కొకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి నవంబర్ 3వ తేదీన జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఉత్కంఠ ని రేకెత్తిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థిగా జో బైడన్ఈ ఎన్నికల్లో తలపడనున్నారు. అయితే డెమోక్రాట్ పార్టీ తరఫున ఈసారి బలమైన అభ్యర్థిగా జో బైడన్ ను ఎదుర్కోవడం ట్రంప్ కు కష్టమేనని, అధ్యక్ష పీఠం పై బైడన్ కూర్చోవడం ఖాయమని  ఫ్రీ పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసు తనం తో వివాదాస్పదంగా మారాడు. ఒకవైపు ట్రంప్  లైంగిక వేధింపులు కు పాల్పడ్డారని, మరోవైపు ఇటీవల జరిగిన నల్లజాతీయుల పై పోలీసు కాల్పులు ఇలా వరుస సంఘటనలతో వివాదాస్పదంగా మారాడు.


ఇదిలా ఉంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే అమెరికాలో 1,80000 మంది మరణించగా ప్రపంచంలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా రెండవ స్థానంలో ఉంది. దీంతో అమెరికాలో వైద్య సదుపాయాలు ఎంతమేర సహకరించా యో అర్థమవుతుంది. ఇలాంటి ప్రతికూల అంశాలు నడుమ ట్రంప్ సర్కార్ కు మరోమారు అధ్యక్ష పీఠంపై అమెరికన్ వాటర్ లు కూర్చుని పెడతారా లేదా అన్నది కొద్ది రోజులు ఆగి చూడాల్సిందే...! ఇలాంటి ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా కలిసొచ్చే కొత్త వ్యూహాలను ట్రంపు ఏ విధంగా రచిస్తున్నారు. అంటే డోనాల్డ్ ట్రంప్ ఈ నాలుగేళ్ల పరిపాలనలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారు. అదేవిధంగా గా వలసదారులు నిర్మూలించారు అమెరికా కు వచ్చే ఉద్యోగాలు సంపాదించే హెచ్ వన్ బీ  వీసాలను కఠినతరం చేశాడు.


స్థానిక అమెరికన్లకు ఉద్యోగ ఉపాధి కల్పనలో స్థానికులే ఉద్యోగాలు చేసే విధంగా చేశాడు. అంతేకాకుండా ఇటీవలఅమెరికాలో సెటిల్ అయిన ప్రవాసి ఓటర్లను ఆకర్షించేందుకు కరోనా మహమ్మారి విషయంలో చైనా నే  ఈ వైరస్ ను సృష్టించిందని పదే పదే ఆరోపించారు.  భారతీయ సెటిలర్స్ కూడా ఆకర్షించేందుకు జమ్మూ కాశ్మీర్, ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ అంతర్గత విషయం గా పరిగణించారు. ఇటీవల జరిగిన చైనా కవ్వింపు చర్యలు కూడా తప్పుబట్టారు. ట్రంప్ ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని గట్టిగా నమ్ముతున్నాడు. ఇవన్నీ తనకు కలిసి వచ్చే అంశాలు గా చెప్పుకుంటూ రానున్న ఎన్నికల్లో లో శ్వేతసౌథం పీఠం పై కూర్చున్న పెడతాయని చెప్పుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: