దేశంలో ది బెస్ట్ పీఎం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రధాని మోడీ ఒక్కసారిగా అందరికి విలన్ గా కనిపిస్తున్నారు. రైతు ల ఉద్యమం తో మోడీ పై ఒక్కసారిగా ప్రెషర్ రావడంతో పాటు రైతుల్లో ఉన్న పేరును కూడా చెడగొట్టుకున్నంత పనయ్యింది.  దేశంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి దేశంలో పెద్ద హీరో అయిపోయాడు.. అయితే ఆ హీరో కాస్త ఇప్పుడు జీరో గా మారిపోయాడు. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి విలన్ గా కనిపిస్తున్నారు.. ముఖ్యంగా రైతుల పాలిట దెయ్యంగా మోడీ ని అభివర్ణిస్తున్నారు..

ఇదంతా ఒక్క పని వల్లే అంటే అందరు ఆశ్చర్యపోతారు.. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టం వల్ల దేశంలో ని రైతుల ఆగ్రహానికి గురయ్యారు మోడీ.. ఈ చట్టాన్ని తెచ్చినప్పుడు చాలా పార్టీ వద్దని వాదించాయి.. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ సైతం ఈ బిల్లు కు వ్యతిరేకంగా వాక్ అవుట్ చేశారు. దాంతో ఆదిలోనే మోడీకి హంసపాదు ఎదురైంది. అప్పటివరకు హీరో గా ఉన్న మోడీ లో షాడో నీడలు మొదలయ్యాయి..   ఢిల్లీ లో వేలాదిమంది రైతులు ఇప్పుడు చట్టాన్ని రద్దు  చేయాలనీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే..

అయితే ఈ ఉద్యమం మొదలై చాలారోజులు అవుతున్నా దీనిపై ఓ క్లారిటీ రాలేదు.. దీంతో ఇది సుప్రీం కోర్టు దృష్టికి ఈ విషయం వెళ్ళనట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రైతుల ఉద్యమం తీవ్రత పెరిగి.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న అన్నదాతలు నగరంలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతుందనే ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో నెలకొంది. ఇదే విషయాన్ని సుప్రిం కోర్టు కూడా ప్రస్తావించింది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రైతుల అందోళనపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహచర మంత్రులతో చర్చిస్తున్నారు. నిఘా వర్గాల నుంచి నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సమస్య పరిష్కారం కోసం సుప్రిం కోర్టు చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా స్వీకరించాల్సిన పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: