దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజామున రోడ్ల పైకి పరుగులు తీసిన జనం. ఒక్క క్షణం తమ కుటుంబ సభ్యులలో ఎవరు ఏమైపోతారో అన్న భయం వారిని ఆందోళన పడేలా చేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఏమైందో అని టెన్షన్ పడ్డారు. భయంతో కొందరు ప్రజలు బయటకు పరుగులు తీయడంతో.... భూమి పై ఏర్పడిన పగుళ్ళు చూసి షాక్ అయ్యారు. పెద్ద నష్టం జరగలేదని... తృటిలో తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎక్కువగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కాగా ఈ తెల్లవారు జామున మరో సారి భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఢిల్లీలోని నంగలోయి ప్రాంతంతోపాటు  ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.  ఈ ప్రాంతాలలో సంభవించిన భూప్రకంపనలు ఒక్కసారిగా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేశాయి. కొందరు పరుగులు తీస్తే ... మరికొందరు అసలేం జరుగుతుందో అర్థం కాక ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు.

అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే... భూకంపం స్వల్పంగానే సంభవించడంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.3  గా నమోదైందని ఇది చాలా స్వల్పమైన భూకంపము అని  జాతీయ సీస్మాలజీ కేంద్ర అధికారులు పేర్కొన్నారు.  మళ్లీ ఇటువంటి భూ ప్రకంపనాలు వచ్చే అవకాశాలు ఉన్నా ఏమోనని ప్రజలు భయ పడుతుండగా... పెద్దగా ప్రమాదం లేదని, చింతించాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు అధికారులు. కాగా ప్రస్తుతం ఢిల్లీలోని వాతావరణం ప్రశాంతంగానే ఉంది.   ప్రస్తుతం డిల్లీలో కొన్ని రాష్ట్రాల నుండి రైతులు కొత్తగా ప్రవేశపెట్టిన రైతు బిళ్లలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇంతలో ఇది జరగడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: