నేటి రోజుల్లో కాఫీ, టీలు తాగడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఒక రకంగా చెప్పాలంటే కాఫీ, టీలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం గా మారిపోయాయి. సంతోషం వచ్చినా బాధ వచ్చిన.. స్నేహితులతో ఉన్న కుటుంబంతో ఉన్న..  ఖాళీగా ఉన్న పని చేస్తూ ఉన్న.. ప్రతి ఒక్కరూ కాఫీ టీలు తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి కాఫీ లేదా టీ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే ఆ రోజంతా ఏదో మిస్సయిన ఫీలింగ్ తో ఉంటారు.



 అయితే ప్రస్తుతం టీ కంటే కాఫీ కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు నేటి రోజుల్లో జనాలు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో రకాల కాఫీలు అటు కాఫీ ప్రియులందరికీ కూడా ఆకర్షించడానికి మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక సరికొత్త కాఫీలను తాగి మరింత ఎనర్జీ పొందేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రతిరోజూ ఇలా కాఫీ లేదా టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు ఎన్నో రకాల కాఫీలు తాగి ఉంటారు.. కానీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి మీకు తెలుసా.



 బులెట్ ప్రూఫ్ కాఫీ ఏంటి.. అలాంటి కాఫీ కూడా ఉంటుందా.. అని అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు.  అయితే కాఫీని నెయ్యి కొబ్బరినూనె తేనె కలిపి తయారు చేస్తారు. దీనిని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని అంటారు. ఈ కాఫీ ని పరగడుపున తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.  పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గడంలో ఎంతో ప్రభావవంతంగా ఈ కాఫీ పనిచేస్తుందట. నెయ్యిలోని లినోలిక్ ఆమ్లం జీర్ణక్రియను వేగవంతం చేస్తే నెయ్యి లోని మంచి కొవ్వులు అటు శరీరాన్ని ఎంతో ఉత్తేజ పరచడానికి ఉపయోగపడతాయట. ఇక ఈ కాఫీ తాగితే శరీరంలో కావల్సినన్ని హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయని అంతేకాకుండా మూడ్ స్వింగ్స్ కూడా దూరం అవుతాయి అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: