దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో  అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లోనూ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్థానిక నియంత్రణను మాత్రమే ఆశ్రయిస్తున్నామని నిర్మలాసీతారామన్ చెప్పారు. కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ పెట్టబోదని స్పష్టం చేశారు .దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తే తట్టుకోలేని ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టటం తమకు ఇష్టం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో, అభివృద్ధికి, ఆర్థిక లభ్యతను పెంచడానికి భారతదేశానికి రుణ సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు. కరోనా కట్టడికి 5 స్తంభాల వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు నిర్మలాసీతారామన్ .

టెస్ట్ , ట్రాక్ , ట్రీట్ , వ్యాక్సిన్ , రూల్స్ అనే ఐదు స్తంభాల వ్యూహంతో కరోనా ను కట్టడి చేస్తామన్నారు కేంద్ర మంత్రి. ఆయా రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు.  కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి అన్నారు. కరోనా రెండవ దశలో గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున లాక్డౌన్ల కోసం వెళ్ళడం లేదని స్పష్టంగా చెప్పిన నిర్మల సీతారామన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. రోగులను హోమ్ క్వారంటైన్ చేయడం, ఎక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే కఠిననిబంధనలు విధించడం, స్థానిక కట్టడికి చర్యలు తీసుకోవటం వంటి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: