ఈటల రాజేందర్ ను అనూహ్య కారణాలతో టీఆర్es నుంచి బయటకు పంపినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో రోజుకో సంచలన వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.. తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరో సంచలన వార్త తెరమీదకు వచ్చింది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కేసీఆర్ మంత్రి పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న ముఖ్య కారణం కూడా ఈటెల రాజేందర్ అనే ప్రచారం జరుగుతోంది.. 

ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం ఈటెల రాజేందర్ మద్దతుదారులు అలాగే ఈటెల రాజేందర్ పార్టీ మీద విమర్శలు చేసిన సమయంలో కూడా సైలెంట్ గా ఉన్నా మంత్రులను తప్పించేందుకు అనే ప్రచారం అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వినిపిస్తోంది. కెసిఆర్ కి విధేయులుగా లేరు అని భావిస్తున్న వారందరినీ ఈ సారి సాగనంపే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాదు ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అలాగే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె పేర్లు మంత్రివర్గంలోకి తీసుకునే వారి లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అలాగే కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తుడిగా పేరు సంపాదించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఈ సారి మంత్రి పదవి ఆశిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈటల రాజేందర్ ను తప్పించిన దరిమిలా పార్టీలో ఒక వర్గం ఇప్పటికే అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో కవితకు మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆమెకు మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాల ప్రెజర్ కూడా ఎక్కువగా అవకాశాలు ఉండడంతో ఆమెకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలు రావడానికి ముందే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: