కరోనా వైరస్ కారణంగా సాఫ్ట్వేర్ రంగం మొత్తం అతలాకుతలం అయింది అన్న విషయం తెలిసిందే.  టైం అయింది అంటే చాలు ఆఫీసులకు పరుగు పెట్టే టెక్కీలు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అబ్బా వర్క్ ఫ్రం హోం వస్తే ఎంతబాగుండు అని కోరుకున్న టెక్కీలకు ఆ రోజు రానే వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నో రోజుల నుంచి ఇంటిపట్టునే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వర్క్ ఫ్రం హోం చేస్తున్న సమయంలో అటు కంపెనీలకు కూడా ఎంతగానో లాభం చేకూరింది. ఎందుకంటే కంపెనీ నిర్వహణ ఖర్చు తగ్గడం అదే సమయంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల తో కాస్త ఎక్కువగానే పనిచేయించుకోవడం లాంటివి కూడా చేస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు.


 అయితే ఇలా ఉద్యోగులు కొన్నాళ్ళ వరకు వారు తెగ ఎంజాయ్ చేశారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూనే పనిచేయడం ఎంతో బాగుంది అని భావించారు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఉద్యోగులందరిలో వర్క్ ఫ్రం హోం పై విరక్తి రావడం మొదలైంది. ఇక కొన్ని కొన్ని సార్లు సెలవు దినాలలో కూడా పని చేయాల్సి రావడంతో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ పోయి మళ్లీ ఆఫీస్ లు మొదటి అయితే బాగుండు అని కోరుకునే ఉద్యోగి లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా రోజు రోజుకీ వర్క్ ఫ్రం హోం పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఆఫీసులు తెరుస్తున్నారు అని చెబితే చాలు ఉద్యోగులందరూ క్యూ కడుతున్నారు.



 అయితే మరికొన్ని రోజుల్లో మళ్లీ ఆఫీసులు తెరుచుకొని ఉంటాయని వర్క్ ఫ్రమ్ హోమ్ కి అందరూ స్వస్తిపలిక బోతున్నారు  అని అర్థమవుతుంది. ఇప్పటికే బెంగళూరులో ఐదున్నర లక్షల చదరపు అడుగుల స్థలంలో మైక్రోసాఫ్ట్ విస్తరించి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల మరో మూడు లక్షల చదరపు అడుగుల స్థలం కూడా మైక్రోసాఫ్ట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. తద్వారా మరికొన్ని రోజుల్లో మళ్ళీ కార్యాలయాలు ఓపెన్ చేసి ఉద్యోగులను పిలిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒకవేళ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ ఇలా వర్క్ ఫ్రం హోమ్ కి స్వస్తి పలికితే మిగతా సంస్థలు కూడా అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wfh