రైతన్న అభివృద్ధి కై శాస్త్రవేత్తలు అడుగులు ముందుకేసి గ్రామాలను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు.. సంప్రదాయ పంటలు వద్దని..  కమర్షియల్ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు. స్పష్ట చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటమార్పిడి మార్పుతోనే అభివృద్ధి.. ఆర్థిక పుష్టి సాధ్యమన్నారు  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు.

 ఐసీఏఆర్-భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ఇర్కోడ్, ఇబ్రహీంపూర్, బూర్గుపల్లి, బుస్సాపూర్ గ్రామాలలోని
లబ్ధిదారులైన రైతులకు రూ.5 లక్షల రూపాయల విలువైన పరికరాలు బ్యాటరీ స్ప్రేయర్లు, టార్ఫ్ లిన్ కవర్లు అందజేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు. సిద్దిపేట పట్టణ ప్రజల శాశ్వత పరిష్కారానికి త్రాగునీటి జల వలయమన్నారు హరీష్ రావు.  తాగునీటి ఎత్తిపోతలకు తప్పనున్న తిప్పలు అని..  నాలుగు దశాబ్దాల ముందు చూపుతో..మున్సిపల్ శాశ్వత తాగునీటి అభివృద్ధికై ప్రత్యేక ప్రణాళిక చేశామన్నారు  హరీష్ రావు.  సిద్ధిపేట పట్టణ వాసుల.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు  హరీష్ రావు.


సిద్ధిపేట రింగ్ మేన్ పైపులైన్ గ్రావిటీ ద్వారా పట్టణ ప్రతీ కాలనీకి నీటి తరలింపు ఉంటుందన్నారు  హరీష్ రావు. మల్లన్న సాగర్ నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీకి రింగ్ మేన్ ద్వారా తాగునీరు అందించేలా రూపకల్పన చేస్తున్నామని ప్రకటన చేశారు  హరీష్ రావు. కాన్పుకోసం ప్రభుత్వ ఆసుపత్రి లకు వెళ్ళి  నార్మల్ డెలివరీ చేసుకొని, ఆరోగ్యాన్ని  కాపాడుకోండి ప్రైవేట్ లకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకండని పేర్కొన్నారు హరీష్ రావు.  ప్రభుత్వ ఆసుపత్రిలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని.. సిద్దిపేట నుండి చిన్న కోడూరు వరకు 10 కిలో మీటర్ల మేరకు 80 కోట్ల తో పోర్ లైన్ రోడ్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు హరీష్ రావు.  
-

మరింత సమాచారం తెలుసుకోండి: