కరోనా వైరస్... ఇప్పుడిప్పుడే దీని ప్రభావం నుంచి ప్రజలను నెమ్మదిగా బయటపడుతున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది కరోనా వైరస్. కొవిడ్ కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి పలు దేశాలు ఎన్నో రకాల ఆంక్షలు కూడా విధించాయి. లక్షల మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి కూడా. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు వంద కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది కూడా. కరోనా పాజిటివ్ కేసులు కూడా ప్రస్తుతం దేశంలో 20 వేలకు లోపే నమోదు అవుతున్నాయి. ప్రజలంతా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. ఓ వైపు కరోనా భయపెడుతున్న సమయంలోనే జికా వైరస్, డెంగ్యూ వైరస్‌లు కూడా ప్రజలను భయపెడుతున్నాయి.

ఇప్పుడు కొత్త వైరస్ దేశాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికీ కరోనా వేరియంట్స్ భయపెడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది ఇప్పుడు. ఇప్పుడు కొత్త వైరస్ కేరళ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొత్త వైరస్ కేసులను పినరయి విజయన్ సర్కార్ గుర్తించింది. నోరో వైరస్ పేరుతో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు తెలిపారు. వైత్తిరి సమీపంలోని పూకోడ్ ప్రాంతంలో ఉన్న వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు ఈ నోరో వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. నోరో వైరస్ సోకిన వారు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడతారని వైద్యులు వెల్లడించారు. నోరో వైరస్‌పై ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు కూడా చేసింది. ఇదో రకం అంటు వ్యాధి అని వెల్లడించింది. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కేరళ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. పాడైపోయిన ఆహారం, కలుషిత నీటిని సేవించడం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: