అధికార పార్టీ నాయకులు బిజెపి పై తెలంగాణా లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు బాగా సంచలనం అవుతుంది. తాజాగా దాస్యం వినయ్ భాస్కర్ బిజెపి లక్ష్యంగా కాస్త ఘాటు ఆరోపణలు చేసారు. కేంద్రంలో అధికారంలో ఉన్న గల్లి లో ఉన్న బీజేపీ నాయకులకు సవాల్ చేస్తున్న రాష్టానికి రావాల్సిన నిధులు మంజూరు చేయించాలి అని ఆయన డిమాండ్ చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు ఆయన. కేంద్రంలో ఉంది తెలంగాణ రాష్ట్ర గొంతులను మూసి వేసే విదంగా ఉంది అని వ్యాఖ్యలు చేసారు.

రెండు ప్రశ్నలు వేస్తున్నాం...మీకు నీతి నిబద్ధత ఉంటే విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెప్పించాలి అని ఆయన డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీలు ఉత్తితి హామీలు ఇచ్చారు అని అన్నారు. గత 40సంవత్సరాలు నుండి ఉద్యమం చేస్తున్నాం...అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమం చేస్తున్నామని స్పష్టం చేసారు. కాజీపేట వచ్చే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్టానికి తరలించారని ఆరోపించారు. విభజన చట్టంలో పార్లమెంట్ లో ఆందోళన చేసిన ఇప్పటి వరకు స్పందించలేదు అన్నారు.

బయ్యారం , గిరిజన యూనివర్సిటీ అమలు చేస్తారా లేదా సూటిగా చెప్పాలి అని డిమాండ్ చేసారు. ఓరుగల్లు లాంటి పోరుగల్లు లో విభజన హామీలు అమలు చేస్తారా లేదా సూటిగా చెప్పాలి అని ఆయన నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో గతంలో టిఆర్ఎస్ పార్టీ రాజీనామాలు చేస్తే బీజేపీ  నాయకులు పారిపోయారు అని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని వ్యక్తిగత ఆరోపణలు చేసిన సహిస్తామని కానీ తెలంగాణా ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. 60లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ గట్టిగా కాంగ్రెస్ ,బీజేపీ నాయకులను తుమ్మితే కొట్టుకపోతారు అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన చేశారు అని కానీ నిధులు మాత్రం ఏమి ప్రకటన చేయలేదు..టూరిస్టు గా వచ్చారు వెళ్లారు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: