రెండు రోజుల క్రితం భ‌ర‌త‌మాత ఓ ధీరుడిని కోల్పోయింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ క్రాష్‌లో ప్రాణాలు విడిచారు. ఈ ప్ర‌మాదంలో బిపిన్ భార్య‌ మధులిక రావత్ సహా 13 మంది చ‌నిపోయారు. ఆ దుర్ఘ‌ట‌న‌పై దేశం మొత్త0 అశ్రునివాళుల‌ర్పి స్తుంటే కొంద‌రు దేశ‌ద్రోహులు, మ‌తోన్మాదులు మాత్రం సోష‌ల్ మీడియా వేదికగా అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మ‌ర‌ణంపై సంతోష‌క‌ర‌మైన ఈమోజీలు పెడుతూ రాక్ష‌సానందం పొందుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల్లో పోలీసులు వివిధ రాష్ట్రాల్లో కేసులు పెడుతున్నారు.. అరెస్టులు చేస్తున్నారు.


 అయితే, సినీ ద‌ర్శ‌కుడు అలీ అక్భ‌ర్ తాను ఇస్లాం వీడారు. ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మిల‌ట‌రీ ఉన్న‌త స్థాయి వ్య‌క్తి చ‌నిపోతే ఎమోజీలు పెట్టుకునే సంస్కృతిలో ఇక‌పై నిల‌బ‌డ‌లేన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇక్క‌డ మ‌తం మార‌డం అనేది కాదు ఒక వ‌స్త్రాన్ని విడుస్తున్నాను అని అనుకుంటున్నాన‌న్నారు. ఇక ముందు ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను అంగీక‌రించ‌ను అని.. మ‌న దేశం కోసం క‌ష్ట‌ప‌డిన ఒక గొప్ప వ్య‌క్తి అకాల మ‌ర‌ణం చెందితే ఇలాగ సంతోష‌ప‌డ‌డం క‌రెక్ట్ కాద‌ని వాదించారు.

అయితే, ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌పై కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందించి చ‌ర్య‌లు తీసుకుంటుంటే.. కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మిన్న‌కుండిపోయాయి.  జమ్మూ కశ్మీర్ పోలీసులు రాజౌరికి చెందిన దుకాణదారుడు సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టు పెట్టార‌ని అరెస్టు చేశారు. కానీ, అత‌నికి సంబంధించిన ఏ వివ‌రాల‌ను వెల్ల‌డించలేదు. అలాగే రాజ‌స్థాన్‌లో కూడా బిపిన్ రావ‌త్ మ‌ర‌ణంపై పోస్ట్ చేసిన వారిపై కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌తో దేశం కోసం పోరాడిన వ్య‌క్తి మ‌ర‌ణం ప‌ట్ల సోష‌ల్ మీడియా వేదిక‌గా అభ్యంత‌ర‌క‌ర రీతిలో  స్పందించ‌డం, పోస్టులు పెట్ట‌డంపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలాంటి వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: