ప్ర‌పంచ దేశాల‌పై ఆదిప‌త్యం చెలాయించేందుకు యుద్దాలు మొద‌ల‌య్యాయి. ఇలా చ‌రిత్ర‌లో అనేక యుద్ధాలు జ‌రిగాయి. ఇప్ప‌టికే రెండు ప్ర‌పంచ యుద్దాలతో దేశాలు అత‌లాకుతలం అయ్యాయి. ఈ క్ర‌మంలో మూడో ప్ర‌పంచ యుద్ధం రాకుండా దేశాల‌న్ని సంఘ‌టితంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ప్ర‌పంచం ఎప్పుడో రెండుగా విడిపోయింది. ఇది ఎవ‌రూ అంగీక‌రించ‌క‌పోయినా నిజ‌మిదే.. పైకి స్నేహితుల్లా క‌నిపిస్తున్న దేశాలు లోప‌ల శ‌తృవులుగా దీంతో యుద్ధం వ‌స్తే ఎలా అని ప్ర‌తి దేశం త‌మ స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టుగా ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ పెద్ద‌న్న అని చెప్పుకుంటున్న అమెరికాను దాటేసేందుకు చాలా దేశాలు ఎప్పుడో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశాయి.


 ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో రాబోయే యుద్ధాల‌ను ఎదుర్కొనేందుకు  చైనా-ర‌ష్యా క‌లిసి రిహార్స‌ల్స్ కూడా చేప‌ట్టాయి. 2021లో బ్రిటిష్ ర‌క్ష‌ణ విధానంలో అనేక మార్పులు క‌నిపించాయి. దేశాల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇథియోపియా సివిల్ వార్‌, ఉక్రెయిన్ వేర్పాటు వాద ఉద్య‌మాల కార‌ణంగా 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 14వేల మంది మ‌ర‌ణించారు. సిరియాలో ఇస్లాం టెర్ర‌రిస్టుల వ‌ల్ల యుద్ధ‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. రాబోయే రోజుల్లో యుద్ధం వ‌స్తే అది ఎలా ఉంటుంది. ప‌శ్చిమ దేశాల‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌నే దానికి యుద్ధ తంత్రం ఎప్పుడో సిద్ధం అయిందట‌. ప‌శ్చిమ దేశాల‌తో యుద్ధం వ‌స్తే ఎదుర్కొనేందుకు ర‌ష్యా-చైనా దేశాలు ఇప్ప‌టికే రిహార్స‌ల్స్ కూడా ప్రారంభించాయి.


    అయితే, బ్రిట‌న్ విడుద‌ల చేసిన ఓ నివేదిక‌లో ప‌శ్చిమ దేశాల‌కు చైనా, ర‌ష్యా నుంచే అస‌లైన పెనుముప్పు పొంచి ఉంద‌ని పేర్కొంది. చైనా-ర‌ష్యా ర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ సైబ‌ర్ అంశాలే ఉన్నాయి. పాశ్చ‌త్య వ్య‌వ‌స్థ‌ను దెబ్బ తీయ‌డం, ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం, సున్నిత‌మైన డాటాను దొంగ‌లించ‌డం వంటి వాటిపై ఈ రెండు దేశాలు దృష్టి సారించాయి. భ‌విష్య‌త్తులో పాశ్చాత్య దేశాలతో ఎలాంటి గొడ‌వ‌లు ఏర్ప‌డినా వాటిని ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, యుద్ధానికి దారితీసే పరిస్థితుల‌ను కూడా ఈ రెండు దేశాలు ప్రభావితం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మితృత్వంతో ప్ర‌పంచ‌దేశాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయ‌నే అంచ‌నాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.
     

మరింత సమాచారం తెలుసుకోండి: