తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల  చంద్ర శేఖర్ రావు ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం కామా రెడ్డిలో నివాసం ఉన్న ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. తెలంగాణ   రాష్ట్ర పరిధిలోని  రాజంపేట మండలంఅర్గోండ గ్రామంలో గునిగంటి వారి స్వస్థ లం. . అయితే చాలా కాలం క్రితమే కమలాకర్ రావు కామారెడ్డిలో స్తిరపడ్డారు. కమలాకర్ రావు కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తేలు. అయితే వారంతా రాజకీయాలకు దూరంగా తమదైన జీవనం గడుపుతున్నారు. కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన వెనుక కమలాకర్ రావు ప్రోద్బలం ఎంతో ఉందని టిఆర్ ఎస్ పార్టీ నేతలు చెపుతుంటారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు అంటే దశాబ్ద కాలం క్రితం కమలాకర్ రావు సతీమణి మృతి చెందారు. ఆంత బిజీలోనూ  కెసిఆర్ ఆమె కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ  తరువాత ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక పనుల ఒత్తిడి  కారణంగా కామారెడ్డికి తరచుగా వెళ్లడం జరగలేదు.  అయితే కె. చంద్ర శేఖర్ రావు ఎప్పుడు కామారెడ్డి వెళ్లినా  ఆయన తన మేన మామ కమలాకర్ రావును పరామర్శించి వచ్చేవారు. కామా రెడ్డిలో తయారయ్యే బెల్లం వాసన తనకు ఇప్పటికీ గుప్పుమని వస్తుంటుందని కెసిఆర్  చాలాసార్లు మీడియా జనం ముందు వ్యాఖ్యానించేవారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ భారతావని తో పాటు తెలంగాణ రాష్ట్రం పై పడగ వేసి ఉండటంతో జనం ఎక్కడ కూడా గతంలో మాదిరి  అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. దీని ప్రభావం కారణంగా కమలాకర్ రావు అంత్యక్రియలు కూడా చాలా సాధారణంగా జరిగాయి.  అతి కొద్దిమంది బంధు మిత్రులు, టి.ఆర్.ఎస్ నాయకులు ఆయన అంతిమ సంస్కారంలో పాల్గోన్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr