ప్రత్యర్ధులే కాదు...సొంత పార్టీ వాళ్ళు సైతం రేవంత్ రెడ్డిని రౌండప్ చేసేశారు..అసలు రేవంత్ ఎవరితో పోరాడాలో అర్ధం కాని పరిస్తితి ఉంది...మామూలుగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్‌దే...టీఆర్ఎస్ తర్వాత ఆ పార్టీకే బలం ఉంది..కానీ వరుసపెట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లాగేసుకుంది..దీంతో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది..పైగా కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లు నడుస్తారు. దీంతో పార్టీ పరిస్తితి మరీ వరెస్ట్‌గా తయారైంది.

అయితే పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక పరిస్తితి మారుతుందని అంతా అనుకున్నారు...పరిస్తితులు కూడా కాస్త మారినట్లే కనిపించాయి..కానీ అనూహ్యంగా మళ్ళీ కాంగ్రెస్ పరిస్తితి మొదటకొచ్చింది..అసలు ప్రత్యర్ధులతో ఫైట్ చేయడం కంటే సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. అసలు కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం అన్నట్లు తయారైంది. వ్యతిరేక వర్గం ఏమో రేవంత్‌ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తుంది. అటు రేవంత్ వర్గం సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తుంది.


ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి ఉంది...సరే సొంత పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ ఉంటూనే ఉంటుంది కదా అని రేవంత్..అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారు..అటు బీజేపీపై కూడా ఫైట్ చేస్తున్నారు..కానీ ఈ పోరాటంలో రేవంత్‌కు సొంత పార్టీ నుంచి సపోర్ట్ రావడం లేదు. ఇక రేవంత్ ఏం మాట్లాడినా సరే, రేవంత్..చంద్రబాబు మనిషి అని టీఆర్ఎస్ విమర్శిస్తుంది. ప్రతిదానికి చంద్రబాబు మనిషి అని ఫైర్ అవుతుంది.

దీనికి రేవంత్ మాత్రమే కౌంటర్లు ఇచ్చుకోవాల్సిన పరిస్తితి..ఇతర నేతల సపోర్ట్ దొరకడం లేదు. అటు జగ్గారెడ్డి ఒకరు రేవంత్ రెడ్డితో ఎప్పుడు కయ్యం పెట్టుకుంటూనే ఉన్నారు..ఇక తాజాగా ఆయన కాంగ్రెస్‌ని వదలడానికి కూడా సిద్ధమయ్యారు. కాకపోతే వీహెచ్ లాంటి సీనియర్లు బ్రతిమలాడుకుంటున్నారు. మరి ఇలా రేవంత్‌కు అన్నిరకాలుగా తలనొప్పులు వస్తూనే ఉన్నాయి...ప్రత్యర్ధులే కాదు..సొంత పార్టీ వాళ్ళు కూడా రేవంత్‌ని రౌండప్ చేసేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: