మామూలుగా ఎక్కడైనా రాజకీయాలలో ప్రత్యర్ధులు ఎడ్డెం అంటే తెడ్డెం అనేలా ఉంటాయి. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఉపయోగపడే పనులు, పథకాలు తెచ్చినా ప్రతిపక్ష పార్టీ మరియు ఇతర వ్యతిరేక పార్టీలు విమర్శలు చేయడం, మంచిలోనూ చెడును వెతకడం, వాటిని హైలైట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్ లోనూ జరుగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఒక ప్రెస్ నోట్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. అందులో విద్యుత్ సరఫరా కు సంబంధించిన విషయం గురించి ప్రజలను మభ్య పెడుతూ, తమ అసత్య కథనాలతో, వార్తలతో తప్పుదోవ పట్టిస్తున్న ప్రముఖ దిన పత్రికలు అయిన ఈనాడు మరియు అంద్రజ్యోతి లపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.

ప్రెస్ నోట్ లో శ్రీకాంత్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియచేశారు. విద్యుత్ శాఖ వినియోగదారులకు విద్యుత్ ను సక్రమంగానే అందిస్తోంది. ఇంతకు ముందు కొన్ని సార్లు రాష్ట్రంలో పవర్ కట్ లు జరిగిన మాట వాస్తవమే. అయితే దానికి రెండింతలుగా చేసి వాటి దిన పత్రికలలో  ముద్రించి ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారు. ఈ నోట్ లో విద్యుత్ శాఖ చాలా సార్లు విద్యుత్ సరఫరా లో సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రజల్లోకి అసత్యాలను తీసుకు వెళ్తున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

అయితే ఇలాంటి వాటిని ఇక ప్రభుత్వం సహించదని శ్రీకాంత్ తెలిపారు. ఇలా తప్పుడు రాతలు రాస్తున్న  ఈనాడు మరియు ఆంద్రజ్యోతి పత్రికలపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రాష్ట్రంలో 24 గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ ను అందిస్తున్నాము అదే విధంగా రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలా పరువు నష్టం కేసులు వీరికి ఏమీ కొత్త కాదు. గతంలోనూ చాలా విషయాలలో ఇలా జరిగాయి. అయితే ఈ నోటీస్ పై సదరు పత్రిక సంస్థ యాజమాన్యాలు ఏ విధంగా స్పందించనున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: