చేసిన తప్పులు ఊరికేపోవు అనే నానుడుంది. ఇపుడు చేసిన తప్పు ఎప్పుడో ఒకపుడు తిరిగి ఎదురుకొడుతుందనే విషయాన్ని మరచిపోతుంటారు చాలామంది. ఇపుడు సోనియాగాంధి, చంద్రబాబునాయుడు వ్యవహారాన్ని చూస్తుంటే అచ్చం అదే గుర్తుకొస్తోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దేశం మొత్తంమీద రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా ఓడిపోతే పార్టీ దీపం పూర్తిగా ఆరిపోయినట్లే.





2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి కాంగ్రెస్ పరిస్ధితి నానాటికి దిగజారిపోతోంది. ఎక్కడ ఎన్నిక జరిగినా గెలుపున్నమాటే మరచిపోయినట్లుంది. సోనియాగాంధి, రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వంపై పార్టీ నేతలు, శ్రేణులకు నమ్మకం పోయినట్లుంది. అందుకనే పార్టీ పరిస్ధితి రోజురోజుకు పాతాళంలోకి దిగిపోతోంది. కొద్దికాలం తర్వాత పార్టీగుర్తు ఎన్నికల్లో మాయమైపోతుందేమో అన్నట్లుగా ఉంది పరిస్ధితి.





దాదాపు ఇదే పరిస్ధితి ఏపీలో టీడీపీకి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో పార్టీ పరిస్ధితి కోమాలోకి వెళిపోయింది. ఇదే పరిస్దితి ఏపీలో కూడా ఎదురవుతుందేమో అన్నట్లుగా ఉంది. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఏ ఎన్నికల్లోనూ పుంజుకున్నది లేదు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం మీద నేతలు, శ్రేణులు నమ్మకం కోల్పోయారు. పార్టీ పరిస్ధితి ఇంత అన్యాయంగా ఉన్నా చంద్రబాబు, తమ్ముళ్ళ గొంతులు బలంగా వినిపిస్తున్నదంటే కేవలం ఎల్లోమీడియా మద్దతు వల్లే. రాబోయే ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించటం ఖాయం.





రెండుపార్టీల పరిస్ధితి సేమ్ టు  సేమ్ గా ఉండటానికి సోనియా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. మెజారిటి జనాల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని సోనియా అడ్డుగోలుగా విభజించారు. దాని ప్రభావం పార్టీపై ఏ విధంగా పడిందో అందరు చూస్తున్నదే. మధ్యప్రదేశ్, పంజాబ్ లో ప్రభుత్వాలు కూలిపోవటానికి సోనియా, రాహుల్ నిర్ణయాలే కారణం. అన్నీ రాష్ట్రాల్లోను ఇలాంటి నిర్ణయాల వల్లే పార్టీ పరిస్ధితి ఇలాగైపోయింది. ఇక చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించటం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తానికి నిర్ణయాలు తీసుకోవటంలో, పార్టీల పరిస్ధితి దిగజారిపోవటంలో సోనియా, చంద్రబాబు సేమ్ టు సేమ్ అనిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: