ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ బహుమతి ఇచ్చేశారు.  ఏడు నూతన మరియు మూడు పూర్తిగా పునర్నిర్మాణం ఔతున్న ఈఎస్ఐ ఆస్పత్రి లను రాష్ట్రానికి మంజూరు చేసింది కేంద్రం.  ఈ రోజు ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ఏడు కొత్త ఈఎస్ఐ హాస్పిటల్  ల వివరాల గురించి, మరియు వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి  ప్రశ్నించారు.  విశాఖపట్నంలోని నందు సుమారుగా 384.26 కోట్ల ఖర్చు తో cpwd శాఖ చే నూతన ఆ సుపత్రి నిర్మితం అవుతుం దని, మంజూ రు తే దీ 01.02.22 అని తెలిపింది కేంద్రం.  విజయనగరం  లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని 73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ చే నిర్మిత మౌతున్నదని..  కాకినాడ నందు 102.77 కోట్ల  కేంద్ర నిధుల కేటాయింపు తో 19.08.20 న కేటాయించబడి cpw d శాఖ చే ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నదని, స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. 

 గుంటూరు,పెనుకొండ, విశాఖపట్నం  అచ్యుతాపురం మరియు నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేయబడి ఇంకనూ భూసేకరణ స్థితిలో ఉన్నాయని,  ఇంకా పునర్నిర్మాణంలో మూడు ప్రధాన ESI ఆసుపత్రులు ఉన్నాయని స్పష్టం  చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా శ్రీ జీవీఎల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా ఆరోగ్య వసతుల లేమితో బాధపడుతున్న ఈ తరుణంలో ఈ యొక్క 10 ఈఎస్ఐ ఆస్పత్రి ల మంజూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అత్యంత ఉపయోగకరం కానున్నాయని, రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క 10 ఈ ఎస్ ఐ హాస్పిటల్ ల  నూతన నిర్మాణం మరియు పునర్నిర్మాణంలకు నిధులను కేటాయించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: