ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత సమయం లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం అయ్యాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమం లోనే ప్రస్తుతం వాహనదారులు ఎవరైనా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాలీ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారులకు భారీ జరిమానాలు విధించడమె కాదు మరింత కఠినం గా వ్యవహరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.అయితే ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు కాస్త కఠినం గానే ఉంటే ఇక ఏప్రిల్ నెల నుంచి మరింత కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు అమలు కాబోతున్నాయనీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.


 ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన  వాహన దారులపై ఏకంగా ఛార్జిషీట్లు వేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.  కరోనా రూల్స్ కారణంగా గ్యాప్ ఇచ్చామని ఇక ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగానే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తం గా స్పీడ్ లిమిట్ ఒకే విధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అంటూ ట్రాఫిక్ జాయింట్ సి పి రంగనాథ్ చెప్పుకొచ్చారు. త్వరలో  స్పీడ్ లిమిట్ విధానం కూడా అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు.


 అంతే కాకుండా అటు వాహనాల పై ఆంటీ స్టిక్కర్ అతికించే రాదని.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఇక నిబంధనలకు విరుద్ధం గా వాహనాలకు స్టిక్కర్లు వేసుకుని తిరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్ మాత్రమే వాడాలని సూచించారు. ఇక రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. పోలీస్ హెచ్చరికల నేపథ్యం లో అటు వాహనదారులు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: