ఇటీవలికాలంలో ఎంత పెద్ద చదువులు చదువుకున్న ఇక ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా తమకు నచ్చిన పని చేయడానికి ఎంతోమంది అన్ని వదిలేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతూ ఉంది అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో ఆటో డ్రైవర్లు అనగానే చాలా మంది కస్టమర్లు చిన్నచూపు చూస్తూ ఉంటారు. చదువు సంధ్య లేని వాళ్ళు మాత్రమే ఆటో ఆడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక ఆటోడ్రైవర్లకు మాతృభాష తప్ప మరో భాష రాదు అని చులకనగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బెంగుళూరుకు చెందిన 74 ఏళ్ల ఆటో డ్రైవర్ ను చూసిన తర్వాత మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ అవాక్కు అవ్వాల్సిందే అని చెప్పాలి.


 ఇంగ్లీష్ స్కిల్స్ ఆటిట్యూడ్తో ప్రయాణికులు అందరినీ కూడా ఆశ్చర్య పరుస్తున్నాడు ఆ ఆటో డ్రైవర్. అతని పేరు పట్టాభిరామన్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే తన ఆటోలో ఎక్కిన కస్టమర్లు అందరితో కూడా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ అసలు ఈ ఆటో డ్రైవర్ కథ ఏంటి అని అనుకుంటున్నారా అది తెలిస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారు.


ఎంఏ.. ఎంఈడి చేసిన పట్టాభిరామన్ ఉద్యోగం రావడంతో ముంబైకి వెళ్లి పోయాడు. అక్కడే కాలేజీలో ఇరవై ఏళ్ల పాటు ఇంగ్లీష్ లో లెక్చరర్  గా కూడా పని చేసాడు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటి దగ్గరే కూర్చుని రెస్ట్ తీసుకోవడం ఎందుకు అని భావించి 14 ఏళ్లుగా ఆటో నడుపుతూ ఉన్నాడు. సాధారణంగా అయితే ఉపాధ్యాయులు నెలకు గరిష్టంగా 10 నుంచి 15 వేల వరకు సంపాదించగలరు. ఇక ప్రైవేట్ సంస్థల్లో పెన్షన్ కూడా ఉండదు. అదే ఆటో రిక్షా ద్వారా రోజుకి 700 నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటారు. ఇక మేము ఉంటున్న ఇంటికి మా కుమారుడు అద్దెకు చెల్లిస్తాడు ఇక నా సంపాదన నాకు నా భార్యకి సరిపోతుంది. ఇప్పుడు సంతోషంగానే జీవిస్తున్నాము. ఇక ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడే పనిచేసే స్వాతంత్రం కూడా ఉంది అంటూ పట్టాభిరామన్ చెబుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: