ఏపార్టీలోను ఎవరికీ పిలిచి పదవులివ్వరు. అవకాశం చూసుకుని తామే పదవులను లాగేసుకోవాలి లేదా గుర్తించి పిలిచేంతవరకు ఓపికపట్టాలి. చూస్తుంటే సీనియర్ నటీమణి విజయశాంతిలో రెండూ లేవనే అనిపిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతు తనను పార్టీలో ఎవరు గుర్తించటంలేదని, ఏపనీ చెప్పటంలేదని తెగబాధపడిపోయారు. తనలాంటి ఫైర్ బ్రాండ్ కు ఇలాంటి పరిస్ధితి ఏమిటంటు వాపోయారు.  చూడబోతే బీజేపీ నాయకత్వంపై ఈమెలో చాలా అసంతృప్తి పేరుకుపోయినట్లుంది.






అయితే విజయశాంతి మరచిపోయిన విషయం ఏమిటంటే పార్టీకి తనవల్ల ఏమిటి ఉపయోగం అని ఎప్పుడైనా తర్కించుకున్నారా ? పార్టీవల్ల ఆమె లాభపడిందా లేకపోతే పార్టీవల్ల తాను లాభపడాలని అనుకుంటున్నారా ? అసలు బీజేపీలో తనకు గుర్తింపు రావాలంటే ఏమిచేయాలి ? పార్టీ కార్యక్రమాల్లో తానే చొరవతీసుకుని దూసుకుపోవాలి. ఎలాగూ సినీ సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ఆమె దూసుకుపోతే ఎవరు కాదనేదిలేదు.




ఇదే సమయంలో సంవత్సతరాలుగా తనకన్నా ముందునుండి ఎంతమంది పనిచేస్తున్నారో  తెలుసుకోవాలి. ఎంతోమంది సీనియర్లే దిక్కూదివాణంలేకుండా ఉన్నారు. పైగా వారిలో చాలామందికి ఆర్ఎస్ఎస్ బేక్ గ్రౌండ్ ఉంది, సంవత్సరాల సీనియరిటీ ఉండి కూడా గుర్తింపుకు నోచుకోకుండా అలా ఉండిపోయారంతే. వాళ్ళకన్నా చిన్నవాళ్ళు, జూనియర్లయిన వాళ్ళు ఎంపీలుగా, ఎంఎల్ఏలుగా ఉన్నారంటే వాళ్ళ చొరవ, దూకుడు చిటికెడు అదృష్టమని కూడా చెప్పుకోవాలి.





ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేక, సీనియారటి కూడా లేకపోయినా తనకు గుర్తింపురావాలని, పదవులు రావాలని విజయశాంతి కోరుకోవటం అత్యశే అవుతుంది. విజయశాంతికి సెలబ్రిటీ అనే హోదా తప్ప మరే క్వాలిపికేషనూ, సామర్ధ్యమూ లేదు. ఏమిలేకపోయినా తనకు అన్నీ కావాలని కోరుకోవటమంటే అమాయకత్వమేనా ? అన్నీవుండి కూడా తమను ఎవరూ పట్టించుకోవటంలేదని అనుకునే సీనియర్ల సంగతేమిటి ? కాబట్టి విజయశాంతి దూసుకుని అయినా పోవాలి లేదా ఒపికయినా పట్టాలి. రెండు కుదరదంటే చిటికెడు అదృష్టాన్ని నమ్ముకోవటం తప్ప వేరే దారిలేదు. ఎందుకంటే సీనియర్లలో చాలామంది చేస్తున్నదదే కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: