గత కొన్ని రోజులుగా ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసిన నీళ్ళు నిండు కుండను తలపిస్తున్నాయి..జనం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూన్నారు. ఉపరితల ఆవర్తనం బలపడి ఇదివరకే తేలికపాటి అల్పపీడనంగా మారింది. తెలంగాణలో సోమవారం మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది..ఏపీలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి.


ఇది ఇలా ఉండగా..కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కొత్తచెరువు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి పుట్టపర్తిలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ వాగులను తలపించాయి. పట్టణంలోని సాయి నగర్, కోట విధుల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అడుగు బయట పెట్టాలంటే భయం భయంగా గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పుట్టపర్తిలో అత్యధికంగా 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నియోజక వర్గ వ్యాప్తంగా 194 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది..


తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈరోడ్ నుంచి కర్ణాటక వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈరోడ్, ధర్మపురి, సేలం జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు మెట్టూరు డ్యామ్ కి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా తమిళనాడులో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: