దీపావళి లో లోన్ తీసుకోనేవారికి ప్రముఖ బ్యాంకులు ఆఫర్లను ప్రకటించింది..లోన్ తీసుకొనే వారికి గుడ్ న్యూస్ ను చెప్పింది..ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు పలు ఇతర బ్యాంకులు పరిమితకాలపు ప్రత్యేక లోన్ ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని బ్యాంకులు గృహ రుణ రేటు తగ్గించగా.. మరికొన్ని బ్యాంకులు గృహ, కారు లోన్లపై ప్రాసెసింగ్ ఛార్జీలను రద్దు చేశాయి. బ్యాంకులు అందించిన ఆఫర్లను ఇప్పుడు తెలుసుకుందాం..



ఐసీఐసీఐ బ్యాంకు.. కూడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. ప్రీ-అప్రూవ్డ్ హోం లోన్, ప్రీ-అప్రూవ్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌లను కేవలం రూ.999 ప్రాసెసింగ్ ఫీజుతో పొందొచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విషయానికి వస్తే గృహ రుణంపై 8.6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కాలపరిమితి అక్టోబర్ 31తో ముగియనుంది. వ్యక్తిగత రుణాల విషయానికి వస్తే.. ఆరంభ వడ్డీ రేటు 10.50 శాతంగా ఉంది. వ్యాపార రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.


ఎస్బీఐ..గృహ రుణ వడ్డీ రేటును 0.25 శాతం మేర తగ్గించినట్టు 'బ్యాంక్ బజార్' పోర్టల్ పేర్కొంది. దీంతో బేస్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.40 శాతానికి దిగొచ్చింది. మరోవైపు జనవరి 2023 వరకు గృహ రుణంపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. తమ గృహ రుణాన్ని ఎస్‌బీఐ నుంచి ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోకి బదిలీ చేసుకునే కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది..


బ్యాంక్ ఆఫ్ బరోడా ..8.45 శాతం వార్షిక వడ్డీతో గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం ఆరంభ వడ్డీ రేటుతో కారు లోన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది..


ఇండస్‌ఇండ్ బ్యాంక్.. ఏడేళ్ల కాలపరిమితి వరకు కారు లోన్స్ ఆఫర్ చేస్తోంది. ఫెస్టివ్ సీజన్‌లో కొనుగోలు చేసే కారుకు 100 శాతం ఫైనాన్స్ చేయనున్నట్టు తెలిపింది..


పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్ 2022ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మాఫీ చేసింది. 8.25 శాతం ఆరంభ రేటుతో గృహ రుణాలు అందించనున్నట్టు వెల్లడించింది.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కూడా ఈ ఫెస్టివ్ సీజన్‌లో గృహ, కారు లోన్లపై ప్రాసెసింగ్ ఛార్జీలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది..


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. గృహ రుణ వడ్డీ రేట్లను 8.2 శాతానికి తగ్గించింది. వేతన, వృత్తి నిపుణులకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్ గడువు నవంబర్ 30 వరకు మాత్రమే ఉంది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: