సొంతంగా వాహానాలను కొనాలని అనుకోనేవారికి కొన్ని బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్తున్నాయి..టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ కొనాలని అనుకొనే వారు బ్యాంకుల నుంచి లోన్ ను తీసుకుంటున్నారు.ఈ మేరకు ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారు కొనాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్ ను చెప్పింది. కళ్ళు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో లోన్ తీసుకొని కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది. కారు కొనేందుకు ఎస్బీఐ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోందని తెలుస్తుంది.


క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన లోన్ వడ్డీ రేటు మారొచ్చు. అంతేకాకుండా ఈ లోన్ పొదడం వల్ల ఏడు ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీని వల్ల నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగే కారు ధరలో 90 శాతం మొత్తాన్ని ఫైనాన్స్ రూపంలో పొందొచ్చు.అదే విధంగా ఎస్‌బీఐ కారు లోన్‌పై జీరో ప్రిపేమెంట్ పెనాల్టీ బెనిఫిట్ ఉంది. ఇంకా ఫోర్ క్లోజర్ చార్జిలు కూడా ఉండవు. ఏడాది తర్వాతనే ఈ బెనిఫిట్ పొందొచ్చు.


ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం లభిస్తోంది. దీని అర్థం మూడు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ కోసం అప్లై చేసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి..ఇకపోతే కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి నవంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏకంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారు, మోడల్, డీలర్ షిప్ ప్రాతిపదికన కారు ఆఫర్‌లో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కారు కొనే వారు ఈ ప్రయోజనం కూడా సొంతం చేసుకోవచ్చు.. మీకు కారు కొనాలని అనుకుంటే వెంటనే అప్లై చేసుకొండి..


మరింత సమాచారం తెలుసుకోండి: