జగన్మోహన్ రెడ్డికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతారా ? జగన్ కు ఎవరు ఎదురుతిరుగుతారా అని ఎల్లోమీడియా వెయ్యికళ్ళతో చూస్తుంటుంది. ఎవరైనా దొరికారంటే వెంటనే వాళ్ళ దగ్గర వాలిపోతుంది. జగన్ కు వ్యతిరేకంగా వాళ్ళేమి మాట్లాడినా విపరీతంగా హైప్ ఇచ్చేస్తుంది. తాను చేసిన ఆరోపణలకు, మాట్లాడిన మాటలకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేటప్పటికి సదరు వ్యక్తి తాను చాలా గొప్పోణ్ణని భావించుకుంటారు. పదిరోజులు అలా జరిగిన తర్వాత ఎల్లోమీడియా మెల్లిగా సదరు వ్యక్తిని పక్కనపెట్టేసి మరొకడిని వెతుక్కుంటుంది.





ఇపుడు ఎల్లోమీడియాకు  వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి హాట్ కేక్ లాగ దొరికారు. ఆనం మాట్లాడే ప్రతిమాటను బాగా హైలైల్ చేసి  ప్రచారం చేస్తోంది. దీంతో ఆనం కూడా రెచ్చిపోయి జగన్ కు వ్యతిరేకంగా నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అనేక అంశాలపై ప్రభుత్వాన్ని వెంకటగిరి ఎంఎల్ఏ నిలదీసినందుకు, వాస్తవాలను జనాలతో మాట్లాడినందుకే జగన్ కక్షకట్టి ఇన్చార్జి బాధ్యతలనుండి తప్పించారని, అవమానించారని అంటోంది.





వైసీపీలో నిజాలు మాట్లాడకూడదా ? జగన్ను వాస్తవాలపై ప్రశ్నించకూడదా ? వాస్తవ పరిస్దితులపై ప్రశ్నించినందుకే జగన్ ఎంఎల్ఏపై కన్నెర్రచేశారంటు నానా రచ్చచేస్తోంది. మరి ఇదే సూత్రం చంద్రబాబునాయుడుకు కూడా వర్తిస్తుందా ? పార్టీలో ఉంటు పనితీరును బాహాటంగా విమర్శించినా, ఆరోపణలు చేసినా చంద్రబాబు అంగీకరిస్తారా ? ఇదే ఎల్లోమీడియా సదరు నేతకు మద్దతుగా నిలబడుతుందా ?





చంద్రబాబును ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే విజయవాడ ఎంపీ కేశినేని నానిపై చంద్రబాబు మద్దతుదారులు ఎంత గోలచేస్తున్నారు. మరా గొడవల్లో ఎల్లోమీడియా ఎంపీకి కాకుండా చంద్రబాబుకు ఎందుకు మద్దతుగా నిలబడుతోంది. నాని ప్రశ్నలకు సమాధానం చెప్పమని చంద్రబాబును ఎందుకు నిలదీయటంలేదు. చంద్రబాబును ఎవరైన నిలదీస్తే ఎల్లోమీడియాకు పార్టీ ద్రోహులుగా కనిపిస్తారు. అదే జగన్ను నిలదీస్తున్న వాళ్ళని  వాస్తవాలు మాట్లాడే వాళ్ళుగా చిత్రీకరిస్తుంది. జగన్ కు ఎదురుతిరిగిన ఎంపి రఘురామకృష్ణంరాజును మొదట్లో బ్రహ్మాండమని చెప్పిన ఎల్లోమీడియా ఇఫుడు చివరిపేజీలకు పరిమితం చేసేసింది. నాలుగురోజులు పోతే ఆనం పరిస్ధితి కూడా అంతే. ఎల్లోమీడియా అండ చూసుకుని రెచ్చిపోతే చివరకు ఎలాంటి వారైనా నాశనమైపోవాల్సిందేనేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: