మూడురోజుల కుప్పం పర్యటనల్లో చంద్రబాబునాయుడు మాటలు విన్న బయటవాళ్ళకు ఇంకేముంది రామచంద్రారెడ్డి పనైపోయిందనే అనుకుంటారు. కానీ అసలు విషయం చిత్తూరు జిల్లాలోని జనాలందరికీ తెలుసు. చంద్రబాబు మాటల మనిషే కానీ చేతల్లో ఏమీ ఉండదన్న విషయం ఇప్పటికి ఎన్నోసార్లు అనుభవంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు రోడ్డుషో, ర్యాలీ, సభలను పోలీసులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబు ప్రభుత్వం మీద రెచ్చిపోతున్నారు.





పోలీసులు తనను అడ్డుకున్నారన్న కోపం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చూపించారు.   వచ్చేఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చాలెంజ్ విసిరారు. పెద్దిరెడ్డి కతేంటో తేల్చేస్తానన్నారు. పెద్దిరెడ్డి తనను తాను పుడింగని అనుకుంటున్నాడా ? అంటు రెచ్చిపోయారు. వచ్చేఎన్నికల్లో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను, అనవసరంగా నాతో పెట్టుకున్నాడు అంటు మంత్రి గురించి చంద్రబాబు చాలానే మాట్లాడారు.





ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు చెప్పింది చేసేరకం కాదని అందరికీ తెలుసు. ఎందుకు చేయలేరంటే ఏమీ చేయలేరుకాబట్టే. 2019 ఎన్నికలకు ముందువరకు లేస్తే మనిషిని కానన్నట్లుగా నెట్టుకొచ్చేశారు. మొన్నటి ఎన్నికల్లో కిందపడిన తర్వాత ఇక మళ్ళీ పైకి లేవలేదు. మూడంచెల స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఘోరఓటమే ఇందుకు నిదర్శనం.  చంద్రబాబు స్టైలు ఎలాగుంటుందంటే ఎంతసేపు ఎదుటివాళ్ళని భయపెట్టి, ఒత్తిడిలో పెట్టి కంట్రోల్లో పెట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు. ఎదుటివాళ్ళు ఎదురుతిరిగితే మళ్ళీ వాళ్ళగరించి మాట్లాడరు. నీళ్ళల్లో మొసలికి బలమున్నట్లే చంద్రబాబుకు అధికారంలో ఉన్నపుడు మాత్రమే బలముంటుంది.





ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యర్ధులను ఫేస్ టు ఫేస్ ఎదుర్కోనేంత సీన్ ఉండదు. అందుకనే  వ్యవస్ధలను మ్యానేజ్ చేయటం ద్వారా మాత్రమే కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తారు. లేకపోతే  జనాల్లోకి వచ్చినపుడు, మీడియాలో బెదిరిస్తుంటారంతే. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించటం సంగతి పక్కనపెట్టేస్తే కుప్పంలో తాను ఎలా గెలవాలనేది చూసుకోవాలి. చంద్రబాబు మాటల మనిషైతే పెద్దిరెడ్డి చేతల మనిషన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు లాగ పెద్దిరెడ్డి ఊరికే మాట్లాడేరకం కాదు. వచ్చేఎన్నికల్లో తేడా వచ్చిందంటే చంద్రబాబుకు కుప్పంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: