
అంతేకాదు ఇక స్కూల్ డేస్ ని గుర్తు చేసుకుంటూ అప్పుడు తోటి విద్యార్థులు చేసిన అల్లరిని.. తాము చేసిన చిలిపి పనులను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అది సరేగాని ఇప్పుడు స్కూల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడ ఒక స్కూల్ తెర మీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది . ఆ స్కూల్ అంతలా వార్తలు నిలవడానికి కారణమేముంది అంటే.. ఆ స్కూల్లో కేవలం ఒకే ఒక్క టీచర్ ఉన్నాడు. ఓస్ అంతేనా ఇలా ఒకే టీచర్ ఉన్న స్కూళ్లు చాలానే ఉన్నాయి అని అంటారా.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థి కూడా ఒక్కడే కావడం గమనార్హం.
స్కూల్లో ఒకే టీచర్ ఒకే విద్యార్థి ఉన్నారా ఎక్కడ అని అనుకుంటున్నారు కదా.. మహారాష్ట్రలోని గణేష్పూర్ గ్రామంలో పాఠశాలలో ఈ పరిస్థితి ఉంది. గ్రామం జనాభా 150 మంది మాత్రమే ఇక ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న కార్తీక్ షేక్ కర్ అనే విద్యార్థి ఒక్కడే ఉన్నాడు. పాఠాలు చెప్పేందుకు ఒకే ఒక్క టీచర్ ప్రతి రోజు స్కూల్ కి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇక ఈ స్కూల్లో ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకు బోధన చేస్తూ ఉంటారు టీచర్. అదే గ్రామంలో ఉన్న మిగతా విద్యార్థులు దూర ప్రాంతాల్లోని గవర్నమెంట్ ప్రవేట్ స్కూల్లో చదువుతున్నారు అందుకే ఇక్కడ ఒకే స్టూడెంట్ ఉండడం గమనార్హం. అయితే ఒకే స్టూడెంట్ కదా అని తేలికగా తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు అన్ని వసతులు కల్పించి ఇక స్కూల్ ని నడిపిస్తూ ఉండడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాలి.